బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 18:12:35

కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్న 302 శ్రామిక్‌ రైళ్లు

కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్న 302 శ్రామిక్‌ రైళ్లు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేస్తున్నది. ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు ప్రారంభమైన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఇప్పటివరకు మూడు లక్షల మంది కార్మికులను వారి సొంత రాష్ర్టాలకు తలరించాయి. మే 1 నుంచి ఇప్పటిరకు 302 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడిపామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రోజు మొత్తం 47 రైళ్లు నడపనున్నానామని, అందులో 34 రైళ్లు ఇప్పటికే బయల్దేరాయని వెల్లడించారు. 

ప్రతి శ్రామిక్‌ రైలులో 72 సీట్ల సామర్థ్యం కలిగిన 24 కోచ్‌లు ఉన్నాయని, భౌతిక దూరం పాటించాలనే నిబంధనల్లో భాగంగా వాటిలో 54 మంది ప్రయాణించడానికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. 

శ్రామిక్‌ రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువ మంది వలస కార్మికులను తరలించిన రాష్ర్టాల్లో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా, కేరళ రెండో స్థానంలో ఉన్నది. తమ స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందినవారే అధికంగా ఉంన్నారు.


logo