ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 17:59:09

యూపీలో 3,000 దాటిన కరోనా కేసులు

యూపీలో 3,000 దాటిన కరోనా కేసులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. గురువారం కొత్తగా 61 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,059కి చేరింది. ఈ మొత్తం కేసులలో 1130 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 61 మంది మరణించారు. మిగతా 1868 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, యూపీలోని మొత్తం 75 జిల్లాలకుగాను 67 జిల్లాల్లో కరోనా ప్రభావం చూపిందని, మిగతా 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు.


logo