శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 13:19:10

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు 3 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు 3 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు

చెన్నై:  ముగ్గురు అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, న‌లుగురు జాయింట్ క‌మిష‌న‌ర్లు, 16 మంది డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, మ‌రో 3 వేల మంది పోలీసులు, ఒక బాంబు స్క్వాడ్.. ఇంత హంగామా ఎందుకో తెలుసా?  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న కోసం. చెన్నైలో బీజేపీ ఆఫీస్ బేర‌ర్ల స‌మావేశంతోపాటు కొన్ని అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి వ‌స్తున్న అమిత్ షాకు అసాధార‌ణ భ‌ద్ర‌త క‌ల్పించారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న సందర్భంగా డీఎంకే నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన మాజీ ఎంపీ కేపీ రామ‌లింగం బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయి.