శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 22:58:42

ట్రాక్ట‌ర్ ర్యాలీ అంత‌రాయానికి పాక్ ట్విట్ట‌ర్ ఖాతాల‌ కుట్ర‌!

ట్రాక్ట‌ర్ ర్యాలీ అంత‌రాయానికి పాక్ ట్విట్ట‌ర్ ఖాతాల‌ కుట్ర‌!

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రిప‌బ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు నిర్వ‌హించ‌నున్న ట్రాక్ట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను హైజాక్ చేసేందుకు, అంత‌రాయం క‌లిగించేందుకు పాకిస్థాన్‌లో 308 ట్విట్ట‌ర్ ఖాతాలు ప‌ని చేస్తున్నాయ‌ని ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆరోపించారు. మంగ‌ళ‌వారం రిప‌బ్లిక్ డే ప‌రేడ్ ముగిసిన త‌ర్వాత ప‌టిష్ఠ భ‌ద్ర‌త మ‌ధ్య రైతుల ట్రాక్ట‌ర్ల ప‌రేడ్ కొన‌సాగుతుంద‌ని ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ దీపేంద్ర పాఠ‌క్ తెలిపారు. 

రైతుల ర్యాలీకి అంత‌రాయం క‌లిగించేందుకు, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి పాకిస్థాన్‌లో ఈ నెల 13-18 మ‌ధ్య 308 ట్విట్ట‌ర్ ఖాతాలు స్రుష్టించ‌బ‌డ్డాయ‌ని దీపేంద్ర పాఠ‌క్ తెలిపారు. ఈ విష‌య‌మై వివిధ నిఘా సంస్థ‌ల నుంచి త‌మ‌కు స‌మాచారం అందింద‌న్నారు. రైతుల ట్రాక్ట‌ర్ల ప‌రేడ్ శాంతియుతంగా సాగేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌మ‌కు స‌వాలేన‌ని మీడియాతో అన్నారు. 

పాకిస్థాన్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌ల నుంచి ముప్పు ఉంద‌ని దీపేంద్ర పాఠ‌క్ వెల్ల‌డించారు. సంఘ విద్రోహ శ‌క్తులు శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను స్రుష్టించే ముప్పు ఉంద‌న్నారు. రైతుల నిర‌స‌న‌లు, ట్రాక్ట‌ర్ల ర్యాలీల‌కు పాకిస్థాన్‌కు చెందిన 308 ట్విట్ట‌ర్ హ్యాండిల్స్ హ్యాచ్‌టాగ్స్ జ‌త చేశాయ‌న్నారు. వివాదాస్ప‌ద కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గ‌తేడాది నవంబ‌ర్ నుంచి దేశ‌వ్యాప్తంగా, ప్ర‌త్యేకించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo