శుక్రవారం 03 జూలై 2020
National - May 27, 2020 , 16:36:42

కరోనా ఎఫెక్ట్‌..30 వేల పెళ్లిళ్లు రద్దు

కరోనా ఎఫెక్ట్‌..30 వేల పెళ్లిళ్లు రద్దు

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా దశలవారీగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో పెళ్లికార్యక్రమాలతోపాటు చాలా ఈవెంట్స్‌ రద్దయ్యాయి. లాక్‌డౌన్‌తో గుజరాత్‌లో ఇప్పటివరకు 30వేల పెళ్లిళ్లు రద్దు చేయడం, వాయిదా వేయడం చేశారని గుజరాత్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిజిత్ దేశ్ ముఖ్ తెలిపాడు. 

మార్చి, ఏప్రిల్‌లో పెళ్లిళ్ల సీజన్‌. రాష్ట్రంలో చాలా వరకు పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌తో అవన్నీ రద్దయ్యాయి. కొంతమంది 10 మంది కుటుంబసభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు అని వెడ్డింగ్‌ ప్లానర్‌ దేవంగ్‌ షా చెప్పుకొచ్చాడు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo