బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 08:35:52

జ‌మ్మూకశ్మీర్ కు 30 వేల మంది తిరిగొచ్చారు.

జ‌మ్మూకశ్మీర్ కు 30 వేల మంది తిరిగొచ్చారు.

ల‌ఖ‌న్ పూర్ : లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా చిక్కుకునిపోయిన వాళ్లు జ‌మ్మూక‌శ్మీర్ కు చేరుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌మ్మూక‌శ్మీర్ కు 30 వేల మంది తిరిగి చేరుకున్న‌ట్లు  ఆ రాష్ట్ర హోం శాఖ తెలిపింది. వీరంతా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ , పంజాబ్ లో నిలిచిపోయిన‌ విద్యార్థులు, వ‌ల‌స‌కూలీలు, కార్మికులని,  ల‌‌ఖ‌న్ పూర్ మీదుగా నిబంధ‌నల ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రానికి చేరుకున్నార‌ని పేర్కొంది.

హ‌ర్యానా, ఉత్త‌రాఖండ్, చండీగ‌ఢ్‌, ఢిల్లీ ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యార్థులు, వ‌ల‌స‌కూలీలు, కార్మికులు వ‌చ్చేందుకు మే 7 నుంచి అనుమ‌తినిచ్చిన‌ట్లు ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తీసుకువ‌చ్చే ప్ర‌క్రియ వారంపాటు కొన‌సాగుతుంద‌ని చెప్పారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo