శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 16, 2020 , 10:03:30

దేశంలో కొత్తగా 30,548 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 30,548 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,548 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 88,45,127కు చేరింది. తాజాగా మరో 435 మంది మహమ్మారి బారినపడగా మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,30,070కు పెరిగింది. గత 24 గంటల్లో 43,851 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 4,65,478 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకు 82,49,579 మంది మంది కరోనా నుంచి కోలుకున్నారని మంత్రిత్వశాఖ వివరించింది.  ఇదిలా ఉండగా.. ఆదివారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 8,61,706 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఆదివారం నాటికి 12,56,98,252 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.