రైల్వేలో 30వేల మందికి కరోనా

న్యూఢిల్లీ : గత తొమ్మిది నెలల్లో కొవిడ్ రైల్వేలో 30వేల మంది సిబ్బందికి కరోనా మహమ్మారి సోకిందని, ఇందులో 700 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులను కోల్పోయిందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా మహమ్మారి సమయంలో సాధారణ ప్రజల మధ్య పని చేశారని పేర్కొన్నాయి. గత శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 30వేల మంది రైల్వే ఉద్యోగులు వైరస్ బారినపడ్డారని, మహమ్మారి సమయంలో ప్రజల కోసం వారు చేసిన త్యాగాన్ని ప్రశంసించారు. 30వేల మంది రైల్వే ఉద్యోగులు కరోనా బారినపడ్డారన్నది నిజమని, అయినప్పటికీ.. మా ఉద్యోగుల కోసం చికిత్స విధానం అభివృద్ధి చేశామని, వారిలో ఎక్కువ మంది కోలుకున్నారని, దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు సంభవించాయని రైల్వే వర్గాలు తెలిపాయి.
ప్రతి జోన్, డివిజన్లో కొవిడ్ సంరక్షణ సౌకర్యాలు కల్పించి ప్రతి ఉద్యోగిని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. ప్రారంభంలో 50 కొవిడ్ సంరక్షణ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 74 వరకు ఉన్నాయని రైల్వే బోర్డు చైర్మన్ ఇటీవల తెలిపారు. అయితే మహమ్మారితో మరణించిన వారి సంఖ్య సుమారు 700 అని శనివారం ఆలస్యంగా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఎక్కువగా రైల్వేల కదలికలను సులభతరం చేయడానికి, ప్రత్యేక రైళ్లను నడపడానికి సహకారం అందించిన ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే కరోనాతో మృతి చెందిన రైల్వే ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదని, పెన్షన్, పెన్షనర్ల సంక్షేమశాఖ మార్గదర్శకాల ప్రకారం ఎక్స్‌గ్రేషియా రూపంలో మంజూరు చేయబడుతుందని సెప్టెంబర్‌లో నిర్వహించిన పార్లమెంట్ సమావేశంలో మంత్రిత్వశాఖ ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది.
సెప్టెంబర్ నాటికి 14,714 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా సోకగా.. 336 మంది మరణించారని పార్లమెంట్ మంత్రిత్వశాఖ సమాచారం అందించింది. దక్షిణ సెంట్రల్ రైల్వేలో గరిష్ఠంగా 2200, సెంట్రల్ రైల్వేలో 1323, ఉత్తర రైల్వేలో 1307, దక్షిణమధ్య రైల్వేలో 1145, తూర్పు సెంట్రల్ రైల్వేలో 1013 కేసులు నమోదయ్యాయని సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటగా.. మహమ్మారి నుంచి 95లక్షల మందికిపైగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి