బుధవారం 27 మే 2020
National - May 13, 2020 , 18:43:44

పోలీసుల మనసు దోచుకున్న బుడ్డోడు

పోలీసుల మనసు దోచుకున్న బుడ్డోడు

కొంత మంది పిల్లలు చిన్నప్పటినుంచే అందరికీ భిన్నంగా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ చిచ్చ‌ర‌పిడుగు. 3 ఏండ్ల వ‌య‌సులోనే చెఫ్‌గా మారి క‌ప్‌కేక్స్‌ త‌యారు చేసేశాడు. ఇవి కుటుంబ స‌భ్య‌లుకు అనుకుంటే పొర‌పాటే. ఈ కేకుల‌న్నింటినీ విక్ర‌యించాడు. క‌నీసం 10 వేలు రాక‌పోతాయా అనుకున్నాడు. ఆశ్చ‌ర్యం ఏంటంటే.. ఈ కేకులు 50 వేల‌కు అమ్ముడుపోయాయి. వ‌చ్చిన‌డ‌బ్బంతా త‌ల్లిదండ్రులు క‌రిష్మా, కేశ‌వ్‌ల‌తో క‌లిసి ముంభై ఫౌండేష‌న్ నిధులకు విరాళంగా ఇచ్చాడు. 

ఈ బుడ‌త‌డు పేరు క‌బీర్‌. చిన్న పిల్లవాడి కృషిని ప్రశంసించడానికి ముంబై పోలీసులు సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకున్నారు. ఈ వ‌య‌సులో ఇలాంటి ఐడియా రావ‌డం గ‌మ‌నార్హం అని పొగ‌డ్త‌ల‌తో క‌బీర్‌ను ముంచేశాడు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌. ఇప్పుడు క‌బీర్‌కు సోష‌ల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. logo