మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 18:44:00

ముగ్గురు సిస్టర్స్‌కి.. ముద్దుల మొగుడు

ముగ్గురు సిస్టర్స్‌కి.. ముద్దుల మొగుడు

లక్నో: ఆ వ్యక్తి ముగ్గురు సిస్టర్స్‌కి ముద్దుల మొగుడు. ఇదేదో సినిమా టైటిల్‌ కాదు సుమా. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో జరిగిన రియల్‌ స్టోరి. కాన్షిరామ్‌ కాలనీకి చెందిన కృష్ణా అనే వ్యక్తి 12 ఏండ్ల కిందట ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు శోభా, రీనా, పింకీని ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో కలిసి కాపురం చేస్తున్నాడు. వారంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. కృష్ణకు వారి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

మరోవైపు ‘కార్వా చౌత్’ సందర్భంగా బుధవారం ఆ ముగ్గురు సిస్టర్స్‌ తమ ముద్దుల మొగుడి కోసం ప్రార్థనలు చేశారు. వారంతా కలిసే అద్దంలో అతడి ముఖాన్ని చూశారు. అయితే ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను కృష్ణ ఒకే వేదికపై ఎందుకు పెండ్లి చేసుకున్నాడో అన్నది తమకు ఇప్పటి వరకు తెలియదని, దీని గురించి ఎప్పుడూ కూడా వారు తమతో మాట్లాడలేదని అతడి బంధువు ఒకరు తెలిపారు. అయితే వారంతా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. ముగ్గురు అక్కచెల్లెళ్లు డిగ్రీ చదువుకున్నవారేనని, దీంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలాంటి అడమరికలు లేకుండా 12 ఏండ్లుగా భర్త కృష్ణతో కలిసి కాపురం చేస్తున్నారని ఆ బంధువు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.