సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 11:47:20

ప‌నుల్లో చేరిన 3 వేల మంది కార్మికులు

ప‌నుల్లో చేరిన 3 వేల మంది కార్మికులు

నోయిడా: క‌రోనాను నియంత్రించేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే మే 3 త‌ర్వాత కేంద్రప్ర‌భుత్వం గ్రీన్ జోన్ల లో స‌డ‌లింపులు ఇచ్చింది. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలోని సామ్‌సాంగ్ మొబైల్ ఫ్యాక్ట‌రీ తిరిగి ప్రారంభ‌మైంది. సుమారు 3 వేల మంది కార్మికులు తిరిగి విధుల్లో చేరారు.

యాజ‌మాన్యం కార్మికుల‌ను బ‌స్సుల్లో కంపెనీకి తీసుకొచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ విధులు నిర్వ‌ర్తించేలా యాజ‌మాన్యం చ‌ర్య‌లు తీసుకుంటోంది. శానిటైజర్లు, ఫేస్ మాస్కులు కార్మికుల‌కు అందించారు. మ‌రోవైపు యూపీ పోలీసులు క‌రోనా హాట్ స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేస్తున్నారు. నిబంధ‌న‌లు పాటించని వారిపై కేసులు న‌మోదు చేస్తున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo