బాహుబలి 2 తర్వాత నాలుగేళ్లకు తర్వాత అరణ్య సినిమాతో వచ్చాడు రానా దగ్గుబాటి. ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరణ్య సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
నైజాం- 1.02 కోట్లు
సీడెడ్- 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.52 కోట్లు
ఈస్ట్- 0.30 కోట్లు
వెస్ట్- 0.22 కోట్లు
గుంటూరు- 0.40 కోట్లు
కృష్ణా- 0.27 కోట్లు
నెల్లూరు- 0.13 కోట్లు
‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ఓన్ రిలీజ్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.19 కోట్లు రావాలి. కానీ కేవలం రూ.5 కోట్ల దగ్గరే ఆగిపోయింది. దాంతో రానా దగ్గుబాటికి మరో ఫ్లాప్ తప్పేలేదు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ కానీ కమర్షియల్ గా మాత్రం సేఫ్ కాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి