సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 08:04:04

జమ్ములో ఎన్‌కౌంటర్‌... ముగ్గురు ముష్కరుల హతం

జమ్ములో ఎన్‌కౌంటర్‌... ముగ్గురు ముష్కరుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్‌ జిల్లాలో ఈ రోజు ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని అన్షిపారా గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారనే సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌ జవాన్లు, కశ్మీర్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున గాలింపు మొదలుపెట్టారు. దీంతో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ప్రతిగా పోలీసులు కాల్పులు ప్రారంభించారని శ్రీనగర్‌ డిఫెన్స్‌ ప్రజాసంబంధాల అధికారి చెప్పారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. 

గత 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. శుక్రవారం ఉదయం కుల్గామ్‌ జిల్లాలో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఇందులో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. జూన్‌ నెలలో భద్రతా బలగాలు 48 మంది టెర్రరిస్టులను హతమర్చాయి. ఇందులో ఎక్కువగా దక్షిణ కశ్మీర్‌లోని జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలోనే హతమయ్యారు.


logo