శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 16:45:05

రూంమేట్‌ను 11వ అంతస్థు నుంచి తోసేశారు..!

రూంమేట్‌ను 11వ అంతస్థు నుంచి తోసేశారు..!

మహారాష్ట్ర: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు డబ్బుల వివాదానికి సంబంధించిన ఘటనలో..తమ రూంమేట్‌ను హత్యచేశారు.  నిందితులు అభినవ్‌ జాద్‌, అక్షయ్‌ గోరడే, తేజస్‌ గుజార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే...సదరు ముగ్గురు విద్యార్థులు తమ పాత రూంమేట్‌ సాగర్‌ చిల్వేరికు రూ.15వేలను 10 రూపాయల మిత్తి కింద అప్పుగా ఇచ్చారు. అయితే మంగళవారం పూణేలోని ఓ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో సాగర్‌ చిల్వేరి  ఉన్న 11 అంతస్థుకు వెళ్లి..డబ్బు తిరిగివ్వాలని ముగ్గురు స్నేహితులు అడిగారు. సాగర్‌ చిల్వేరి డబ్బు తిరిగివ్వకపోవడంతో ఘర్షణ జరిగి.. ముగ్గురు స్నేహితులు అతన్ని పైనుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


logo