శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 15:57:38

ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతం

ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతం

శ్రీనగర్‌ : సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌ సైనికులు కాల్పులకు పాల్పడ్డారు. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్‌ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాక్‌ స్థావరాలను కూడా భారత్‌ సైనికులు ధ్వంసం చేశారు. నిన్న పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఫూంచ్‌ జిల్లాలో రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఓ పౌరుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. 


logo