గురువారం 26 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 10:34:45

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

పట్నా: బీహార్‌లోని గయా జిల్లాలో పోలీసుల కాల్పుల్లో జోనల్‌ కమాండర్‌ సహా ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. జిల్లాలోని బారాఛట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కోబ్రా కమాండోలు, బీహార్‌ పోలీసులు సంయుక్తంగా నిన్న సాయంత్రం గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గాలింపు బృందాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారని వెల్లడించారు. మృతుల్లో  మావోయిస్టు జోనల్‌ కమాండర్‌ అలోక్‌ యాదవ్‌ కూడా ఉన్నారని చెప్పారు. ఘటనాస్థలంలో ఏకే 47 రైఫిల్‌, ఇన్సాన్‌ రైఫిల్‌, మ్యాగజీన్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బారాఛట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.