బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 15:06:06

‘ఎన్‌పీఈ 2020’ని అమలు చేయవద్దు: తమిళనాడు సీఎం పళనిస్వామి

‘ఎన్‌పీఈ 2020’ని అమలు చేయవద్దు: తమిళనాడు సీఎం పళనిస్వామి

చెన్నై: కేంద్ర సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన నూతన జాతీయ విధానం(ఎన్‌పీఈ)పై తమిళనాడు సర్కారు అసహనం వ్యక్తంచేసింది. త్రి భాషా సూత్రం తమకు అత్యంత బాధ, విచారం కలిగించిందని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. ఈ విధానాన్ని తాము అమలుచేయబోమని స్పష్టం చేశారు. 

నూతన జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని పునఃపరిశీలించాలని ప్రధాన నరేంద్రమోదీకి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ 2020లో  త్రిభాషా సూత్రం మాకు బాధ కలిగించింది. దశాబ్దాలుగా మా రాష్ట్రం ద్వి భాషా విధానాన్నే అనుసరిస్తోంది. దానిలో ఎలాంటి మార్పు ఉండబోదు.’ అని వ్యాఖ్యానించారు.  

ఎన్‌ఈపీపై రాజకీయ తుఫాను..

నూతన జాతీయ విద్యా విధానంపై తమిళనాడులో రాజకీయ తుఫాను చెలరేగింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్ఈపీని తిరస్కరించాయి. ఇది తమపై బలవంతంగా హిందీ, సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నమంటూ విమర్శించాయి. సారూప్య రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దీనికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి కూడా ఎన్‌ఈపీపై అసహనం వ్యక్తంచేశారు. ఇది అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo