సోమవారం 18 జనవరి 2021
National - Dec 19, 2020 , 13:17:07

దుకాణంలో అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

దుకాణంలో అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం ద‌క్షిణ 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఈ తెల్ల‌వారుజామున ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ దుకాణంలో నిలువ ఉంచిన కిరోసిన్ డ్ర‌మ్ముల‌కు మంట‌లు అంటుకుని అగ్ని కీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. కోల్‌క‌తాకు 20 కిలోమీట‌ర్ల దూరంలోగ‌ల‌ భంగ‌ర్ ప‌ట్ట‌ణంలోని ఘ‌ట‌క్‌ప‌క‌ర్ బ‌జార్ ఏరియాలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

దుకాణంలో ఎగిసిప‌డ్డ మంట‌లు ప‌క్క‌నే ఉన్న మ‌రో దుకాణానికి, టిఫిన్ సెంట‌ర్‌కు, ఓ ఇంటికి అంటుకున్నాయి. దీంతో అంద‌రూ బ‌య‌టికి వ‌చ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ, 50 ఏండ్ల‌ టిఫిన్ సెంట‌ర్ ఓన‌ర్ అతని ఇద్ద‌రు పిల్ల‌లు మాత్రం దుకాణంలోని విలువైన వ‌స్తువుల‌ను బ‌య‌టికి తెచ్చేందుకు వెళ్లి మంట‌లు మ‌రింత ఎక్కువ కావ‌డంతో స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. కాగా, మూడు ఫైరింజ‌న్‌ల సాయంతో ఆ మంట‌ల‌ను ఆర్ప‌డానికి ఐదు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి.. 

ఇంటి పైక‌ప్పు కూలి ముగ్గురు దుర్మ‌ర‌ణం

గువాహ‌టిలో హుక్కా బార్ల మూసివేత‌
బిగ్ బాస్ ఫైన‌ల్‌లో పాల్గొనే చాన్స్ మిస్ కాకండి..!
36 ఆలౌట్‌.. ఇంత దారుణ‌మా ?


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.