గురువారం 28 మే 2020
National - May 24, 2020 , 11:33:40

పోలీస్‌ జీప్‌ బోల్తా.. ముగ్గురి మృతి

పోలీస్‌ జీప్‌ బోల్తా.. ముగ్గురి మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌తో సహా ముగ్గురు మరణించారు. ఎస్‌ఐతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాలిక కిడ్నాప్‌ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం లంఖింపూర్‌ ఖేరీ నుంచి ఘజియాబాద్‌కు పోలీస్‌ బృదం వచ్చింది. పని పూర్తిచేసుకుని తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం హాపురా వద్ద 9వ నంబర్‌ జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్‌, డైవర్‌, మరొకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, మరో అమ్మాయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అందులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో కిడ్నాపర్‌ కూడా ఉన్నారని వెల్లడించారు. 


logo