శుక్రవారం 10 జూలై 2020
National - Jun 04, 2020 , 01:22:28

మరో ఇద్దరు జైషే ఉగ్రవాదులు కూడా ఖతం

మరో ఇద్దరు జైషే ఉగ్రవాదులు కూడా  ఖతం

ఉగ్రవాది ఫౌజీ ఖతం

శ్రీనగర్‌: మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ అలియాస్‌ ఫౌజీ భాయ్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇతడితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఫౌజీ భాయ్‌  ఐఈడీ బాంబులు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతడు 2019 సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగినపుడు పుల్వామాలో క్రియాశీలకంగా పనిచేశాడని పోలీసులు వెల్లడించారు. ఫౌజీ భాయ్‌ జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుడేనని తెలుస్తున్నది.  


logo