యూత్‌ఫుల్ సినిమాలు తీసే దర్శకుల్లో ఒకరు త్రినాథరావు నక్కిన. నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ఈ డైరెక్టర్ మాస్ మహారాజాను దృష్టిలో పెట్టుకుని ఓ కథ సిద్దం చేశాడట. అయితే క్రాక్ సినిమా ఘనవిజయంతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
దీంతో రవితేజ స్థానంలో యువ హీరో వరుణ్ తేజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని త్రినాథరావు ఫిక్సయ్యాడట. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతోపాటు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో గని సినిమా చేస్తున్నాడు.స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ డైరెక్టర్ త్రినాథరావుతో సినిమాకు ఒకే చెప్తాడా..? లేదా అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Recommended Content by ntnews.com