బుధవారం 27 మే 2020
National - May 09, 2020 , 22:24:52

గ్యాస్ డెలివ‌రీ వ్య‌క్తిని దోచుకునేందుకు య‌త్నించారు...

గ్యాస్ డెలివ‌రీ వ్య‌క్తిని దోచుకునేందుకు య‌త్నించారు...

ఢిల్లీ: ద‌క్షిణ ఢిల్లీలోని హౌజ్‌ఖాస్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గ్యాస్ డెలివ‌రీ వ్య‌క్తిని దోచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ముగ్గురు విదేశీయుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్ద‌రు హ‌మీద్అహ్మ‌ది(31), మ‌హ్మ‌ద్ షంషాబాద్‌(29)గా గుర్తించారు. వీరితో పాటు ఉన్న మ‌హిళ అక్క‌డి నుంచి ప‌రారైంది. సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే చిరాగ్ మెట్రోస్ట‌ష‌న్ స‌మీపంలో కారులో ఉన్న ముగ్గురు నిందితులు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ చేస్తున్న స‌తీష్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. నిందితుల‌తో ఉన్న మ‌హిళ స‌తీష్‌ను సిలిండ‌ర్ ధ‌ర ఎంత అని అడిగింది.

 త‌న‌కు హిందీ భాష తెలియ‌ద‌ని, ధ‌ర‌ను భార‌తీయ క‌రెన్సీలో చూపించాల‌ని కోరింది. క‌లెక్ష‌న్ బ్యాగ్ నుంచి డ‌బ్బులు తీసి చూపిస్తుండ‌గా కారు వెనుక సీట్లో కూర్చున్న వ్య‌క్తి రూ.11,180 ఉన్న బ్యాగ్‌ను లాక్కుని స‌తీష్‌ను వెన‌క్కు నెట్టి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. స‌తీష్ వారిని వెంబ‌డిస్తూ గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంలో స్కూట‌ర్‌పై వెళుతున్న వ్య‌క్తి వారి కారుకు అడ్డంగా రావ‌డంతో నిందితులు కారు ఆపి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. స్థానికులు వారిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. నిందితుల‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


logo