గురువారం 26 నవంబర్ 2020
National - Oct 06, 2020 , 16:17:16

బైకును ఢీకొట్టిన లారీ.. తండ్రి, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి

బైకును ఢీకొట్టిన లారీ.. తండ్రి, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో బైకును లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తండ్రి, ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌-జ‌న్‌స‌త్ ర‌హ‌దారిలోని సిఖేడా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవ‌ర్ మితిమీరిన వేగంతో రావ‌డంవ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే లారీ డ్రైవ‌ర్ ప‌రార‌య్యాడ‌ని, అత‌ని కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.