e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News రూ. 3 కోట్లు సీజ్.. న‌లుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగులు అరెస్టు

రూ. 3 కోట్లు సీజ్.. న‌లుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగులు అరెస్టు

రూ. 3 కోట్లు సీజ్.. న‌లుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగులు అరెస్టు

భోపాల్ : లంచం కేసులో న‌లుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగుల‌ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో ఓ సెక్యూరిటీ కంపెనీకి సంబంధించిన బిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు భారీగా కోత‌లు విధిస్తున్నార‌ని ఆరోపిస్తూ సీబీఐకి ఆ కంపెనీ నిర్వాహ‌కులు ఫిర్యాదు చేశారు. కోత‌లు విధించొద్దు అంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి.. లంచం డిమాండ్ చేసిన ఎఫ్‌సీఐ అధికారుల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. న‌లుగురు అధికారుల ఇచ్చిన స‌మాచారంతో ఎఫ్‌సీఐ క్ల‌ర్క్ నివాసంలో సోదాలు చేయ‌గా, రూ. 2.17 కోట్ల న‌గదుతో పాటు 8 కేజీల బంగారం, న‌గ‌దును లెక్కించే యంత్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌సీఐ డివిజనల్‌ మేనేజర్‌ హరీశ్‌, మేనేజర్లు అరుణ్‌ శ్రీవాస్తవ, మోహన్‌ పరాటే, కిశోర్‌ మీనాను సీబీఐ అధికారులు భోపాల్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూ. 3 కోట్లు సీజ్.. న‌లుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగులు అరెస్టు

ట్రెండింగ్‌

Advertisement