సోమవారం 06 జూలై 2020
National - Jun 26, 2020 , 10:58:48

మూడు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న పోలీసులు

మూడు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న పోలీసులు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా ఉధృతంగా ఉన్నది. సామాన్య ప్రజలతోపాటు పోలీసులు కూడా వైరస్‌ భారిన పడుతున్నారు. కరోనా వల్ల ఇప్పటికే 37 మంది పోలీసులు మరణించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు తమ కోసం ప్రత్యేకంగా మూడు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. కోలే కల్యాణ్‌, మరోల్, మెరైన్ డ్రైవ్ ప్రాంతాల్లో పోలీసుల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ముంబై పోలీస్‌ పీఆర్వీవో ప్రణయ్‌ అశోక్‌ తెలిపారు. ఈ మూడు క్వారంటైన కేంద్రాల్లో మొత్తం వెయ్యి పడకలు ఉన్నాయని ఆయన చెప్పారు. కరోనా సోకిన పోలీసులను ఈ కేంద్రాల్లో ఉంచి వైద్య చికిత్స అందిస్తామని ప్రణయ్‌ అశోక్‌ పేర్కొన్నారు. logo