గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 12:20:41

స్కూల్‌ విద్యార్థుల కోసం స్వ‌యంప్ర‌భ ఛాన‌ళ్లు..

స్కూల్‌ విద్యార్థుల కోసం స్వ‌యంప్ర‌భ ఛాన‌ళ్లు..

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల విద్యార్థుల చ‌దువులు దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌వ‌ద్దు అన్న ఉద్దేశంతో స్వ‌యంప్ర‌భ డీటీహెచ్ ఛాన‌ళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. టెక్నాల‌జీ ఆధారిత విద్య‌ను అందించిన‌ట్లు తెలిపారు. ఇంట‌ర్నెట్ యాక్సెస్ లేని వారికి కూడా ఆ ఛాన‌ళ్ల ద్వారా సేవ‌లు అందించిన‌ట్లు చెప్పారు. మార్చి 24వ తేదీ నుంచి దీక్షా ప్లాట్‌ఫాంలో విద్యార్థులు ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటున్నార‌న్నారు.  ఆ ఫ్లాట్‌ఫాంను సుమారు 61 కోట్ల మంది వీక్షించిన‌ట్లు చెప్పారు. 

స్వ‌యం ప్ర‌భ కింద ఇప్ప‌టికే మూడు ఛాన‌ళ్లు స్కూల్ విద్యార్థుల‌కు కేటాయించామ‌న్నారు. ఇప్పుడు మ‌రో 12 ఛాన‌ళ్ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. విద్యా సంబంధిత వీడియో కాంటెంట్‌ను విద్యార్థుల‌కు చేర‌వేసేందుకు ఎయిర్‌టెల్‌, టాటా స్కై లాంటి ప్రైవేటు డీటీహెచ్ ఆప‌రేట‌ర్ల‌తో లింకు పెట్టుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ-పాఠ‌శాల వెబ్‌సైట్‌లో సుమారు 200 కొత్త పుస్త‌కాల‌ను జోడించిన‌ట్లు సీతారామ‌న్ తెలిపారు.logo