ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 22:06:36

ఉగ్ర‌వాద కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు మృతి

ఉగ్ర‌వాద కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు మృతి

శ్రీ‌న‌గ‌ర్ : జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు మృతిచెందిన‌ట్లు పోలీసులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. వైకే పోరా గ్రామంలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో సీనియ‌ర్ పోలీసు అధికారులు టెర్ర‌ర్ క్రైమ్ స్పాట్‌కు చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్ల‌డైంద‌న్నారు. మృతుల‌ను వైకె పోరా నివాసి బీజేపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిదా హుస్సేన్ యాటూ, సోఫర్ దేవ్‌సర్ నివాసి అబ్దుల్ రషీద్ బీగ్ కుమారుడు ఉమర్ రషీద్ బీగ్, వైకె పోరా నివాసి మొహద్ రంజాన్ కుమారుడు ఉమర్ రంజాన్ హజామ్‌గా పోలీసులు గుర్తించారు.