శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 18:00:59

ఆయుధ స్మ‌గ్ల‌ర్లు ముగ్గురు అరెస్టు

ఆయుధ స్మ‌గ్ల‌ర్లు ముగ్గురు అరెస్టు

పాట్నా : ఆయుధ స్మ‌గ‌ర్లు ముగ్గురిని పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న బిహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. జ‌క్క‌న్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప్రాంతంలోని బ‌స్‌స్టాండ్ వ‌ద్ద ఆయుధాల అక్ర‌మ ర‌వాణా గురించి ఎస్‌టీఎఫ్‌కు స‌మాచారం అందింది. ఈ మేర‌కు జ‌క్క‌న్‌పూర్ పోలీసులు, ఎస్‌టీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా రైడ్ చేసి ఆయుధ స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి ఎనిమిది పిస్ట‌ల్స్‌, 16 మ్యాగిన్స్‌, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో మితాపూర్ బస్టాండ్ వద్ద ఉన్న అరా జిల్లా నివాసికి ఆయుధాలు అందజేసేందుకు వెళ్తున్న‌ట్లు స్మ‌గ్ల‌ర్లు తెలిపారు. ప్ర‌ధాన సూత్ర‌దారితో పాటు ఇత‌ర స‌ర‌ఫ‌రాదారుల గురించి పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. బీహార్ అసెంబ్లీకి రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో పోలీసులు రాష్ర్టంలో శాంతిభద్రతలపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించారు. 


logo