బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 06:35:50

క్వారంటైన్ సెంట‌ర్ నుంచి ముగ్గురు పరారు

క్వారంటైన్ సెంట‌ర్ నుంచి ముగ్గురు పరారు

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో క‌రోనా పాజిటి‌వ్ గా నిర్దార‌ణ అయిన ముగ్గురు వ్య‌క్తులు క్వారంటైన్ సెంట‌ర్ నుంచి పారిపోయారు. గ‌త 24 గంట‌ల్లో ముగ్గురు వ్య‌క్తులు ఆస్ప‌త్రిలో నుంచి సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి పారిపోయారు. లాక్ డౌన్ నిబంధ‌నలు ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు న‌మోదు చేశాం. ఆ ముగ్గురిని ప‌ట్టుకుని క్వారంటైన్ సెంట‌ర్ లో చేరుస్తామ‌ని ఒడిశా పబ్లిక్ రిలేష‌న్స్ విభాగం అధికారి ఒక‌రు తెలిపారు. ఒడిశాలో జోన్ల వారిగా లాక్ డౌన్ నిబంధన‌లు క‌ఠిన‌త‌రం చేస్తున్నారు. ‌ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo