మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 18:20:03

తమిళనాడులో 24 గంటల్లో 3,943 కరోనా కేసులు

తమిళనాడులో 24 గంటల్లో   3,943  కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.  ప్రభుత్వం ఎన్ని  చర్యలు చేపట్టినప్పటికీ   కరోనా ప్రభావాన్ని మాత్రం తగ్గించలేకపోతున్నది.   ప్రతి రోజూ దాదాపు 4వేల మంది  మహమ్మారి బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో  కొత్తగా 3,943 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక రోజు వ్యవధిలో మరో 60 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 90,167 మంది కరోనా బారినపడ్డారు. 

ప్రస్తుతం 38,889 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 50,074 డిశ్చార్జ్‌ అయ్యారు.  మంగళవారం సాయంత్రం వరకు  కరోనా వల్ల  1,201 మంది మరణించారు. 


logo