శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 19:25:05

బీహార్‌లో విజృంభిస్తున్న కరోనా

బీహార్‌లో విజృంభిస్తున్న కరోనా

పాట్నా : బీహార్‌లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వైరస్‌ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 3,934 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 79,720కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. ఇవాళ బెగుసారై జిల్లాలో 44, భోజ్‌పూర్ జిల్లాలో 109, తూర్పు చంపారన్ జిల్లాలో 162, గోపాల్‌గంజ్ జిల్లాలో 115, కతిహార్ జిల్లాలో 177, ముజఫర్‌పూర్ జిల్లాలో 128, నలంద 103 జిల్లాలో , పాట్నా జిల్లాలో 781, రోహ్తాస్ జిల్లాలో 131, సరన్ జిల్లాలో 160, సహర్సా జిల్లాలో 108, సమస్తిపూర్ జిల్లాలో 146, వైశాలి జిల్లాలో 132, వెస్ట్ చంపారన్ జిల్లాలో 108 కేసులు నమోదైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇవాళ అత్యధికంగా 64,399 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 861 మృతి చెందారు. ఇప్పటివరకు 21,53,011 మంది కరోనా బారినపడగా 14,80,885 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,28,747 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 43,379 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా మృతి చెందారని  కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.


logo