బుధవారం 08 జూలై 2020
National - May 28, 2020 , 20:45:44

మే 1 నుంచి 3736 శ్రామిక్‌ రైళ్లలో 48 లక్షల వలస కార్మికుల తరలింపు

మే 1 నుంచి 3736 శ్రామిక్‌ రైళ్లలో 48 లక్షల వలస కార్మికుల తరలింపు

న్యూడిల్లీ: అధికారిక సమాచారం ప్రకారం మే 1 నుంచి 3,736 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లలో మొత్తం 48 లక్షల మంది వలస కార్మికులను భారత రైల్వే వారి గమ్య స్థానాలకు చేరవేసింది. వీటిలో 3,157 రైళ్లు వాటి లక్ష్యాలను చేరుకోగా, 386 రైళ్లు ఇంకా రవాణాలో ఉన్నాయి. ఈ రైళ్లలో ఎక్కువగా గుజరాత్‌ (979), మహారాష్ట్ర (695), పంజాబ్‌ (397), ఉత్తరప్రదేశ్‌ (263), బీహార్‌ (263) రాష్ర్టాల నుంచి రైళ్లు ఏర్పాటు చేశారు. ఈ శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను దేశవ్యాప్తంగా కొన్ని రాష్ర్టాల్లో నిలిపివేశారు. ఎక్కువగా రైళ్లు ఉత్తర ప్రదేశ్‌ (1520), బీహార్‌ (1296), జార్ఖ్‌ండ (167), మధ్యప్రదేశ్‌ (121), ఒడిశా (139) గమ్యంగా నడిచాయి. 

ఆయా ప్రాంతాలకు ఎక్కువ మంది వలస ప్రయాణికులు చేరుకున్నారు. మే 1 నుంచి ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న వలస కార్మికులకు రైల్వే 85 లక్షలకు పైగా ఉచిత భోజనం, సుమారు 1.25 కోట్ల ఉచిత నీటి బాటిళ్లను పంపిణీ చేసిందని తెలిపింది. భారతీయ రైల్వే పీఎస్యూ ఐఆర్‌సీటీసీ తయారుచేస్తున్న భోజనం జోనల్‌ రైల్వేలు పంపిణీ చేస్తున్నాయి. అన్ని శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ళలో ప్రయాణించే వలసదారులకు ఆహారం, నీటిని అందిస్తున్నారు అధికారులు. 

ఐఆర్‌సిటిసి పూరి, రోటీ, అరటిపండ్లు, బిస్కెట్లు, కేక్‌, నామ్‌కీన్‌, వెజ్‌ పులావ్‌, పావో భాజీ, పులిహోర, ఉప్మా, పోహా, మొదలైనవి రైల్‌లో ప్రయాణించే వలసదారులకు భోజనంగా అందిస్తున్నాయి. ప్రతి రైలును నడపడానికి మొత్తం ఖర్చులో 85 శాతం భారత రైల్వే భరిస్తుండగా, మిగిలినవి రాష్ర్టాలు ఛార్జీల రూపంలో భరిస్తున్నాయి.


logo