శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 07:05:46

అసోంలో భూకంపం.. 3.7 తీవ్ర‌త‌

అసోంలో భూకంపం.. 3.7 తీవ్ర‌త‌

గువాహ‌టి: ఈశాన్య భార‌తంలో మ‌రోమారు భూమి కంపించింది. అసోంలో ఇవాళ తెల్ల‌వారుజామున 3.23 గంట‌ల‌కు స్వ‌ల్ప‌ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోద‌య్యింది. క‌ర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్న‌ద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మొల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది.

అక్టోబ‌ర్ మొద‌టి వారంలో కూడా భూమి కంపించింది. గ‌త నెల 3న‌ గువాహటి స‌మీప ప్రాంతాల్లో భూకంపం వ‌చ్చింది. గువాహ‌టికి ప‌శ్చిమాన 51 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంద‌ని, భూ అంత‌ర్భాగంలో 10 కి.మీ. లోతులో భూమి కంపించంద‌ని ఎన్‌సీఎస్ వెల్ల‌డించింది.