ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 22, 2020 , 07:42:34

మహారాష్ట్రలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రత

మహారాష్ట్రలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రత

పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ పరిసర ప్రాంతాల్లో వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పాల్ఘర్‌లో భూమి కంపించగా రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు.  ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో  ఊపిరిపీల్చుకున్నారు. ఈ నెల 9న ఇదే ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై 3.2 తీవ్రత నమోదైంది. 11న ముంబై పరిసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.