శుక్రవారం 03 జూలై 2020
National - Jun 26, 2020 , 21:24:21

మేఘాలయలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 3.3గా నమోదు

మేఘాలయలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 3.3గా నమోదు

వెస్ట్‌గరోహిల్స్‌ : మేఘాలయ రాష్ట్రంలోని తుర ప్రాంతంలో శుక్రవారం భూమి కంపించింది. తుర ప్రాంతానికి సుమారు 79కిలోమీటర్ల దక్షిణంగా ఈ భూకంపం సంభవించినట్ల్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు పేర్కొంది. గురువారం త్రిపుర రాష్ట్రంలోని ధర్మానగర్‌కు ఈశాన్యంగా 63కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించగా రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 2.8గా నమోదైంది.

మిజోరాం రాష్ట్రంలోని దక్షిణ చంపాయ్‌ ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై 4.5గా నమోదైంది. ఈశాన్య రాష్ర్టాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలు, లోయలు అధికంగా ఉండే  ఈ రాష్ర్టాల్లో భూకంప తీవ్రత పెరిగితే అధికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.


logo