శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 01:52:17

3,129 మంది ఆర్మీ వైద్య సిబ్బందికి...

3,129 మంది ఆర్మీ వైద్య సిబ్బందికి...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో భాగంగా.. భారత సైన్యంలో వైద్య సేవలందిస్తున్న 3,129 మంది ఆర్మీ వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్‌ వర్కర్లు శనివారం కరోనా టీకా వేసుకొన్నారు. నౌకాదళం, వైమానిక దళంలో వైద్య సేవలు అందిస్తున్నవారికి కూడా టీకాలు వేశారు. నౌకాదళం చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నౌకాదళంలో దాదాపు 200 మంది వ్యాక్సిన్‌ తీసుకొన్నారు.

టీకా సమాచారం చోరీ

అమ్‌స్టర్‌డ్యామ్‌: తమ సర్వర్ల నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ డాక్యుమెంట్లను సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఔషధ నియంత్రణ సంస్థ యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. 

VIDEOS

logo