శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 15:40:48

బైకుపై డ్ర‌గ్స్ అక్ర‌మంగా త‌ర‌లింపు

బైకుపై డ్ర‌గ్స్ అక్ర‌మంగా త‌ర‌లింపు

ఇటాన‌గ‌ర్: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పోలీసులు భారీ మొత్తంలో డ్ర‌గ్స్ ప‌ట్టుకున్నారు. చంగ్‌లాంగ్ జిల్లాలో డ్ర‌గ్స్ అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నార‌న్న స‌మాచారంతో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. నాంచిక్ టీ గార్డెన్ కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు బైకుపై వెళ్తుండ‌గా త‌నిఖీలు చేయ‌గా..వారి వ‌ద్ద 3.1కిలోల ఓపియ‌మ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఇండో-మ‌య‌న్మార్ బార్డ‌ర్ కు స‌మీపంలో మయ‌న్మార్ కు చెందిన వ్య‌క్తి ద‌గ్గ‌ర ఇద్ద‌రు ఓపియ‌మ్‌ను కొనుగోలు చేసిన‌ట్లు గుర్తించాం. ఓపియ‌మ్ ను సీజ్ చేసి..ఖార్‌సంగ్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీస్ అధికారి ఒక‌రు తెలిపారు. డీఐజీ కిమె కామింగ్ డ‌గ్స్ ప‌ట్టుకున్న అధికారుల‌ను అభినందించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo