గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 07:07:02

కశ్మీర్‌లోయలో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభం

కశ్మీర్‌లోయలో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో 2జీ మొబైల్‌ డాటా సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో తప్ప కశ్మీర్‌లోని మిగిలిన అన్ని జిల్లాలో లో స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. హిజ్‌బుల్‌ ముజాహిద్దిన్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూతోపాటు మరో ఉగ్రవాదిని మే 6న పుల్వామాలో భద్రతా దళాలు మట్టుపెట్టాయి. దీంతో అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. కాగా, గతేడాది 370వ ఆర్టికల్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో 4జీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. అవి ఇప్పటికీ ప్రారంభమవలేదు.


logo