మంగళవారం 31 మార్చి 2020
National - Mar 05, 2020 , 12:09:13

29 కరోనా పాజిటివ్ కేసులు : కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

29 కరోనా పాజిటివ్ కేసులు :  కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌పై ఇవాళ రాజ్య‌స‌భ‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు చేయ‌క‌ముందే.. కేంద్ర ప్ర‌భుత్వం వైర‌స్ నియంత్ర‌ణ‌కు అన్ని ఏర్పాటు చేసింద‌న్నారు.  మార్చి 4వ తేదీ వ‌ర‌కు దేశంలో 29 మంది క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  ప్ర‌తి రోజూ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు.  మంత్రుల బృందం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా ప‌రిస్థితిపై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నార‌న్నారు.  అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల స్క్రీనింగ్ ఇక నుంచి క‌చ్చితంగా చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  సుమారు 29 వేల మందిని మానిట‌ర్ చేస్తున్న‌ట్లు చెప్పారు.  


logo
>>>>>>