గురువారం 28 మే 2020
National - May 19, 2020 , 20:48:01

జమ్మూకశ్మీర్ లో కొత్తగా 28 పాజిటివ్ కేసులు

జమ్మూకశ్మీర్ లో కొత్తగా 28 పాజిటివ్ కేసులు

కశ్మీర్ : జమ్మూకశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 22 కేసులు కశ్మీర్ డివిజన్ లో నమోదు కాగా..6 కేసులు జమ్మూ డివిజన్ లో నమోదయ్యాయి. ఇవాళ్టి కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 1317కు చేరుకుంది. వీటిలో 653 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్ లో లాక్ డౌన్ 4.0 కొనసాగుతుంది. కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo