శనివారం 28 మార్చి 2020
National - Mar 18, 2020 , 17:05:27

విదేశాల్లో 276 మంది భార‌తీయుల‌కు క‌రోనా

విదేశాల్లో 276 మంది భార‌తీయుల‌కు క‌రోనా

హైద‌రాబాద్‌:  విదేశాల్లో ఉన్న 276 మందికి క‌రోనా సోకిన‌ట్లు ఇవాళ కేంద్ర విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. లోక్‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌కంగా ఆ శాఖ ఈ స‌మాధానం ఇచ్చింది.  ఇరాన్‌లో 255 మంది, యూఏఈలో 12  , ఇట‌లీలో అయిదుగురు, హాంగ్‌కాంగ్‌, కువైట్‌, రువాండా, శ్రీలంక‌ల్లో ఒక్కొక్క‌రికి వైర‌స్ సోకిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే వైర‌స్ సోకిన వారు ప్ర‌యాణం చేయ‌కూడదు అన్న నిషేధం ఉన్న‌ది.  వైర‌స్ సోకిన వాళ్లు ఆ దేశంలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అనేక దేశాల‌కు భార‌త్ వీసాల‌ను ర‌ద్దు చేసింది. బ్రిట‌న్‌, ఈయూ, మ‌లేషియా నుంచి వ‌స్తున్న వారిపై ట్రావెల్ బ్యాన్ విధించింది.   logo