గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 15:36:16

లాక్‌డౌన్‌ అతిక్రమించిన 27వేల మంది అరెస్టు

లాక్‌డౌన్‌ అతిక్రమించిన 27వేల మంది అరెస్టు

ముంబై : మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ అమలు నాటి నుంచి ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించిన 27వేల 446మందిని అరెస్టు చేశామని, 83,970 వాహనాలను సీజ్‌ చేశామని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.  వీరిపై ఐపీపీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి సుమారు 8కోట్ల 41లక్షల 32వేల 461 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతమవుతుండడంతో ప్రభుత్వం ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ పొడిగించి, సులుభమైన నిషేధాఘ్నలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 1,32,075 కరోనా బారినపడగా 6,170మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ వెల్లడించింది. 


logo