మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 13:13:40

బ‌ర్త్‌డే కేక్‌ను క‌త్తితో క‌ట్ చేశాడు.. జైలు పాల‌య్యాడు

బ‌ర్త్‌డే కేక్‌ను క‌త్తితో క‌ట్ చేశాడు.. జైలు పాల‌య్యాడు

పుట్టిన‌రోజు ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. అని ప్ర‌తిఒక్క‌రూ రెండు నెల‌ల ముందు నుంచే ఎదురు చూస్తుంటారు.  ఆరోజు ఎదైన త‌ప్పు జ‌రిగినా చాలా బాధ‌ప‌డుతారు. అంతేకాదు ఆరోజు వారిని ఎవ‌రూ ఒక్క మాట కూడా అన‌రు. అలాంటిది ఓ వ్య‌క్తి జైలు పాల‌య్యాడు. త‌న పుట్టిన‌రోజు నాడు కేక్ క‌ట్ చేశాడు. దీనికే జైలు కెళ్ల‌డం ఏంటి అనుకుంటున్నారా?

అత‌ను కేక్‌ను చాక్‌తో క‌ట్ చేయ‌లేదు. పెద్ద క‌త్తితో క‌ట్ చేశాడు. అంతే 27 ఏండ్ల యువ‌కుడిని ఆయుధ చ‌ట్టం ప్ర‌కారం అరెస్ట్ చేశారు. ఈ క‌త్తితో నేరానికి పాల్ప‌డుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ వ్య‌క్తి ర‌హ‌తే న‌గ‌ర్ నివాసి అమ‌న్ వాకిల్ ఉఫాడేగా అజ్ని పోలీస్ స్టేష‌న్ అధికారి గుర్తించారు. ఏ ప‌నులు ఎలా చేయాలో అలానే చేయాలి. కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తే ఇలాగే అవుతుంది. 
logo