శనివారం 11 జూలై 2020
National - Jun 19, 2020 , 18:14:45

క‌రోనా జ‌యించిన 27 రోజులు చిన్నారి!

క‌రోనా జ‌యించిన 27 రోజులు చిన్నారి!

పుణె: మ‌హారాష్ట్ర‌లోని పుణె న‌గ‌రంలో 27 రోజుల చిన్నారి క‌రోనాను జ‌యించాడు. పుణె జిల్లాలోని హదాప్సర్‌ గ్రామానికి చెందిన మ‌హిళ నెల రోజుల క్రితం పురిటి నొప్పుల‌తో జిల్లా కేంద్రంలోని సాస్సోన్ ఆస్ప‌త్రిలో చేరింది. మే 20న మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. అయితే పుట్టుక‌తోనే ఆ చిన్నారి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు గమనించారు. అనుమానంతో క‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్ష చేయగా పాజిటివ్ వ‌చ్చింది. 

దీంతో ప్ర‌త్యేకంగా చికిత్స అందించిన వైద్యులు రెండు వారాల త‌ర్వాత మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ వ‌చ్చింది. దీంతో ఈ రోజు ఆ చిన్నారిని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు. బాలుడితోపాటు నగ‌రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల నుంచి మ‌రో 193 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు పుణె న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ అధికారులు తెలిపారు. దీంతో పుణెలో క‌రోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,906 కు చేరింద‌ని చెప్పారు. 


logo