బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 10:50:02

కర్ణాటకలో 27 ‘కరోనా’ కేసులు..

కర్ణాటకలో 27 ‘కరోనా’ కేసులు..

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మీడియాకు తెలిపారు. వారిని ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచామని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్‌ కోవిద్‌-19 బాధితులకు అందుబాటులో ఉంచామని మంత్రి పేర్కొన్నారు. కరోనా బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని మంత్రి శ్రీరాములు తెలిపారు. 

కాగా, ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు విధిగా స్వీయ నిర్బంధంలో ఉండాలనీ.. సామాజిక దూరం పాటిస్తూ, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ దరిచేరదని మంత్రి శ్రీరాములు వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆస్పత్రికి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. 


logo
>>>>>>