బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 07:50:14

యూపీకి ఏడు బ‌స్సుల్లో 267 మంది వ‌ల‌స కూలీల త‌ర‌లింపు

యూపీకి ఏడు బ‌స్సుల్లో 267 మంది వ‌ల‌స కూలీల త‌ర‌లింపు

అంబాలా: దేశ‌వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కూలీల‌ను సొంత రాష్ట్రాల‌కు త‌ర‌లించే కార్య‌క్ర‌మం నిర్విరామంగా జ‌రుగుతున్న‌ది. తాజాగా హ‌ర్యానాలోని అంబాలా జిల్లా నుంచి 267 మంది వ‌లస కూలీలు ఏడు బ‌స్సుల్లో యూపీలోని వివిధ ప్రాంతాల‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. వారిలో మూడు బ‌స్సుల్లో 122 మంది షామ్లీకి, రెండు బ‌స్సుల్లో 67 మంది స‌హ‌రాన్‌పూర్‌కు రెండు బ‌స్సుల్లో 78 మంది భాగ్‌ప‌ట్‌కు బ‌య‌లుదేరారు. 

యూపీకి చెందిన 267 మందిని హ‌ర్యానా రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన ఏడు బ‌స్సుల్లో త‌ర‌లించామ‌ని, వారిని యూపీ స‌రిహ‌ద్దులో దిగ‌బెట్టి బ‌స్సులు వెన‌క్కు వ‌స్తాయ‌ని, అక్క‌డి నుంచి యూపీ అధికారులు కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లిస్తార‌ని అంబాలా జిల్లా నోడ‌ల్ ఆఫీస‌ర్ ఆర్కే గుప్తా తెలిపారు. వ‌ల‌స కూలీల కోసం బ‌స్సుల్లో స‌రిప‌డా భోజ‌నం, నీరు, శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచామ‌ని ఆయ‌న చెప్పారు. వీరంతా శ‌నివారం రిజిస్ట్రేష‌న్ చేసుకుని, ఆదివారం రాత్రి బ‌య‌లుదేరార‌ని గుప్తా తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo