శుక్రవారం 03 జూలై 2020
National - May 03, 2020 , 15:50:37

ఆగ్రాలో 569కి చేరిన కరోనా కేసులు

ఆగ్రాలో 569కి చేరిన కరోనా కేసులు

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొత్తగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో చారిత్రక తాజ్‌మహల్‌ ఉన్న ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 596కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 2,487 కరోనా కేసులు నమోదవగా, 43 మంది మరణించారు. రాష్ట్రంలో 1755 యాక్టివ్‌ కేసులు ఉండగా, 689 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

గత 24 గంటల్లో దేశంలో 2644 కరోనా కేసులు నమోదవగా, 83 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికవరకు 39,980 కేసులు రికార్డవగా, 1301 మంది మరణించారు. 


logo