శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 16:25:09

ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు

న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో నిత్యం వెయ్యికిపైగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి తగ్గింది. సోమవారం ఢిల్లీలో 613 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,497 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 26 మంది వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందారని ప్రభుత్వం ఆరోగ్య బులిటెన్‌లో తెలిపింది.

దేశ రాజధానిలో ఇప్పటివరకు 1,31,219 కరోనా కేసులు నమోదు కాగా 1,16,372 మంది మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10,994 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 3,853 మంది మృతి చెందారు. ఇవాళ ఒక్కరోజే 3,821 మందికి ఆర్టీపీసీఆర్‌/సీబీనాట్‌/ట్రూనాట్‌ పరీక్షలు చేయగా 7,685 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 9,58,283 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.


logo