శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 15:42:38

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. 255 మంది అరెస్ట్‌

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. 255 మంది అరెస్ట్‌

కరోనా మహమ్మారి విస్తురిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను విధించాయి. బయట తిరగొద్దని ఎంత చెబుతున్నా కొంతమంది వినిపించుకోవడంలేదు. పోలీసులు, అధికారులు హెచరికలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. ఎలాంటి కారణం లేకుండానే చాలామంది రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరించక తప్పడంలేదు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 255 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం వీరందరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. 


logo