శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 14:19:07

మ‌రో 253 మంది పోలీసుల‌కు క‌రోనా

మ‌రో 253 మంది పోలీసుల‌కు క‌రోనా

ముంబై: మహారాష్ట్ర‌లో క‌రోనా బారిన‌డుతున్న పోలీసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. రోజురోజుకు క‌రోనా సోకుతున్న పోలీసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 253 మంది పోలీసులు క‌రోనా పాజిటివ్‌లుగా తేలారు. దీంతో ఇప్ప‌టివ‌రకు మొత్తం 21,827 మంది పోలీసులు మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. ఇందులో 18,158 మంది కోలుకోగా, 3435 మంది చికిత్స పొందుతున్నారని మ‌హారాష్ట్ర పోలీసు శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో ఐదుగురు పోలీసులు క‌రోనాతో చ‌నిపోవ‌డంతో మొత్తం మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 234కు పెరిగింది. 

రాష్ట్రంలో ఈరోజు 18,390 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా 392 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 12,42,770 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. మొత్తం 33,407 మంది చ‌నిపోయారు.